Saturday 20 July 2013

మినీ పీసీ
                
పర్సనల్‌ డెస్క్‌టాప్‌ అంటే సీపీయూనే ప్రధాన వ్యవస్థ. ఎక్కువ స్పేస్‌ని ఆక్రమించినప్పటికీ ఇదే మూలాధారం. దాన్ని టిఫిన్‌ బాక్స్‌ పరిమాణంలో మార్చేసి మినీ పీసీగా ముందుకొచ్చింది ZOTAC ZBOX nano ID65 PLUS. థర్డ్‌ జనరేషన్‌ ఇంటెల్‌ కోర్‌ ఐ7 ప్రాసెసర్‌తో పని చేస్తుంది. ర్యామ్‌ 4 జీబీ. హార్డ్‌డ్రైవ్‌ సామర్థ్యం 500 జీబీ. Intel HD 4000 గ్రాఫిక్‌ కార్డ్‌ ఉంది. ఆరు యూఎస్‌బీ పోర్ట్‌లు ఉన్నాయి. ఇతర వివరాలకు http://goo.gl/sAlP2
ఇదే తొలిసారి
ప్రపంచంలోనే అత్యంత పల్చటి తెరతో మొబైల్‌ స్క్రీన్‌ని ఎల్‌జీ కంపెనీ తయారు చేసింది. అదే HD LCD Display. తెర మందం ఎంతో తెలుసా? 2.2 మిల్లీమీటర్లు. తెర పరిమాణం 5.2 అంగుళాలు. రిజల్యూషన్‌ 1080X1920 పిక్సల్స్‌. ప్రస్తుతం మార్కెట్‌లో అన్ని హెచ్‌డీ మొబైళ్ల కంటే ఎక్కువ ప్రకాశవంతంగా గ్రాఫిక్స్‌ని చూడొచ్చు. ఇతర వివరాలకు http://goo.gl/4gONq
ఆటలే ఆటలు
పిల్లలకు అరచేతిలోనే ఆట స్థలాన్ని సృష్టించేలా సిద్ధమైంది మితాషీ కంపెనీ తయారు చేసిన‌ GameIn Thunderbolt పరికరం. ఆండ్రాయిడ్‌ 4.0 ఓఎస్‌తో పని చేస్తుంది. తాకేతెర పరిమాణం 4.3 అంగుళాలు. పరికరం చుట్టూ ఆటలకు అనువైన గేమింగ్‌ బటన్లను ఏర్పాటు చేశారు. గూగుల్‌ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న గేమ్స్‌ని డివైజ్‌ సపోర్ట్‌ చేస్తుంది. 1 Ghz ప్రాసెసర్‌తో పని చేస్తుంది. ఇంటర్నల్‌ స్టోరేజ్‌ 4 జీబీ. 32 జీబీ వరకూ మెమొరీ పెంచుకునే వీలుంది. డ్యుయల్‌ కెమెరాలతో (వెనక 2 మెగాపిక్సల్‌, ముందు వీజీఏ కెమెరాలు) డివైజ్‌ పని చేస్తుంది. ధర సుమారు రూ.6,799. ఇతర వివరాలకు http://goo.gl/3yJZT
వినండిలా!
బోస్‌ కంపెనీ మొదటిసారిగా వైర్‌లెస్‌ హెడ్‌ఫోన్‌ని అందుబాటులోకి తెచ్చింది. పేరు Bose AE2w. చక్కని క్వాలిటీతో మ్యూజిక్‌ వినొచ్చు. కేవలం వినడమే కాదు. మీ స్మార్ట్‌ఫోన్‌కి వచ్చిన కాల్‌ని మాట్లాడొచ్చు. చెవులకు అనువుగా ఉండేలా హెడ్‌ఫోన్‌ని రూపొందించారు. హెడ్‌ఫోన్‌ని ఒకేసారి రెండు డివైజ్‌లకు అనుసంధానం చేయవచ్చు. మ్యూజిక్‌ వినిపిస్తూనే చిటికెలో కాల్స్‌ మాట్లాడే హెడ్‌ఫోన్‌గా మారిపోతుంది. 30 అడుగుల దూరం వరకూ పని చేస్తుంది. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 7 గంటలు వాడుకోవచ్చు. ఛార్జ్‌ అవ్వడానికి పట్టే సమయం 3 గంటలు. యూఎస్‌బీ కేబుల్‌తో ఛార్జ్‌ చేయవచ్చు. బరువు 150 గ్రాములు. ధర సుమారు రూ.19,000. వీడియో, ఇతర వివరాలకుhttp://goo.gl/rdh6U
ఇదే మొదటిది
విండోస్‌ 8 ఆపరేటింగ్‌ సిస్టం, 8.1 అంగుళాల తాకేతెరతో మొదటిసారి అందుబాటులోకి వచ్చింది Acer Iconia W3. దీని బరువు 540 గ్రాములు. రిజల్యూషన్‌ 1280X800 పిక్సల్స్‌. డ్యుయల్‌ కోర్‌ ఆటమ్‌ ప్రాసెసర్‌ని వాడారు. ఇంటర్నల్‌ మెమొరీ 32జీబీ. బ్యాటరీ బ్యాక్‌అప్‌ 8 గంటలు. బ్లూటూత్‌ కీబోర్డ్‌తో ట్యాబ్లెట్‌ని వాడుకోవచ్చు. చిత్రంలో మాదిరిగా ట్యాబ్‌ని కీబోర్డ్‌లో డాక్‌ చేసి వాడొచ్చు. ధర సుమారు రూ.30,399. మరిన్ని వివరాలకు http://goo.gl/TS1nO
* ఏసర్‌ 15.6 అంగుళాల తాకేతెరతో మరో ట్యాబ్‌ని అందుబాటులోకి తెచ్చింది. పేరు Aspire R7. నోట్‌బుక్‌, ట్యాబ్‌లా వాడుకునేందుకు అనువుగా ప్రత్యేక స్టాండ్‌తో ఇది పని చేస్తుంది. Notebook, Eze, Pad, Display మోడ్స్‌లో పని చేస్తుంది. అవసరం మేరకు తిప్పుతూ వాడుకోవచ్చు. హెచ్‌డీ డిస్‌ప్లేతో పనిచేస్తుంది. వీడియో, ఇతర వివరాలకు http://goo.gl/yLvfa
ఇదో ఫ్యాబ్లెట్‌
 
డ్యుయల్‌ సిమ్‌తో ఫోన్‌ వాడుంటారు. మరి, ట్యాబ్లెట్‌లానే కనిపిస్తూ ఫ్యాబ్లెట్‌లా ముందుకొచ్చిన MTV Volt 1000 డివైజ్‌ని వాడారా? ఎంటీవీ, స్వైప్‌ టెలికామ్‌ సంయుక్తంగా దీన్ని రూపొందించాయి. దీంట్లో ప్రత్యేకంగా నిక్షిప్తం చేసిన టీవీ ప్లేయర్‌తో ఎంటీవీని చూడొచ్చు. తాకే తెర పరిమాణం 6 అంగుళాలు. రిజల్యూషన్‌ 854X480 పిక్సల్స్‌. ఆండ్రాయిడ్‌ 4.1 ఎస్‌తో పని చేస్తుంది. 1Ghz డ్యుయల్‌ కోర్‌ ప్రాసెసర్‌ని వాడారు. ర్యామ్‌ 1 జీబీ. ఇంటర్నల్‌ స్టోరేజ్‌ 4జీబీ. బ్యాటరీ సామర్థ్యం 2,850 mAh. వెనక భాగంలో 8 మెగాపిక్సల్‌, ముందు 1.3 మెగాపిక్సల్‌ కెమెరాల్ని ఏర్పాటు చేశారు. బ్లూటూత్‌ 4.0, ఎఫ్‌ఎం సదుపాయాలున్నాయి. ఇతర వివరాలకుhttp://goo.gl/a5ThQ
ధర తక్కువే
కాస్త తక్కువ ధరలో ట్యాబ్లెట్‌ని కొనాలంటే Simmtronics ట్యాబ్లెట్‌ పీసీ గురించి తెలుసుకోవాల్సిందే. 7 అంగుళాల తాకే తెరతో రూపొందించారు. ధర సుమారు రూ.5,999. పేరు ఎక్స్‌ప్యాడ్‌ ఎక్స్‌ 722. 1Ghz ప్రాసెసర్‌ని వాడారు. ర్యామ్‌ 512ఎంబీ. ఇంటర్నల్‌ స్టోరేజ్‌ 4జీబీ. మెమొరీ సామర్థ్యాన్ని 32 జీబీ వరకూ పెంచుకోవచ్చు. వెనక భాగంలో 3 మెగాపిక్సల్‌, ముందు 0.3 మెగాపిక్సల్‌ కెమేరాల్ని నిక్షిప్తం చేశారు. http://goo.gl/0l0yq
కొత్త స్పీకర్లు
టీవీ పరిమాణంలోనే కాదు. స్పీకర్లలోనూ నాణ్యమైనవి కావాలనుకుంటే సోనీ కంపెనీ తయారు చేసిన Sony 4K Bravia గురించి తెలుసుకోవాల్సిందే. 55, 65 అంగుళాల తెర పరిమాణాలతో ఆకట్టుకుంటున్నాయి. రిజల్యూషన్‌ 3840X2160 పిక్సల్స్‌. Magnetic Fluid Speaker డిజైన్‌తో రూపొందిన మొట్టమొదటి టీవీ స్పీకర్లు ఇవే. నాజూకుగా కనిపిస్తూ ఎక్కువ అవుట్‌పుట్‌ని అందిస్తాయి. వై-ఫై, యూఎస్‌బీ, 3జీ, ఎన్‌ఎఫ్‌సీ... సౌకర్యాలు అదనం.http://goo.gl/7tQDD
కాస్త హుందాగా...
ఇంట్లోనో... ఆఫీస్‌లోనో వాడేందుకు ప్రొఫెషనల్‌గా కనిపించే మానిటర్‌ కావాలనుకుంటే BenQ BL2411PT మానిటర్‌ని ప్రయత్నించొచ్చు. తెర పరిమాణం 24 అంగుళాలు. రిజల్యూషన్‌ 1920X1200 పిక్సల్స్‌. చూసేందుకు అనువుగా కావాల్సిన ఎత్తులో సెట్‌ చేసుకోవచ్చు. 'లైట్‌ సెన్సర్‌' తో ఆటోమాటిక్‌గా మానిటర్‌ బ్రైట్‌నెస్‌ని మార్చేస్తుంది. మీరు సిస్టంని వదిలి కొంతసేపు ఎక్కడికైనా వెళితే 'ఎకో సెన్సర్‌' తో ఆటోమాటిక్‌గా ఎకో మోడ్‌లోకి మారిపోతుంది. దీంతో మానిటర్‌ మన్నిక పెరుగుతుంది. HAS (Ultra flexible Height Adjustment System) తో మానిటర్‌ని కావాల్సిన కోణంలోకి తిప్పుకుని వాడుకోవచ్చు. http://goo.gl/PsM1T
గేమింగ్‌ అడ్డా
మీరు గేమింగ్‌ ప్రియులైతే ప్రత్యేక ప్లే స్టేషన్‌ సిద్ధంగా ఉంది. అదే OUYA Gaming Console ఆండ్రాయిడ్‌ 4.1 జెల్లీబీన్‌ ఓఎస్‌తో పని చేస్తుంది. మూడు అంగుళాల పరిమాణంలో రూపొందించారు. ప్రత్యేక కేబుల్‌ ద్వారా టీవీ, కంప్యూటర్‌కి అనుసంధానం చేసి గేమ్స్‌ ఆడుకోవచ్చు. 1.7Ghz quad-core ARM నుంచి అందుబాటులోకి వచ్చిన NVIDIA Tegra 3 ప్రాసెసర్‌ని వాడారు. ర్యామ్‌ 1 జీబీ. ఇంటర్నల్‌ మెమొరీ 3 జీబీ. NVIDIA ULP Geforce గ్రాఫిక్స్‌ని వాడారు. హెచ్‌డీఎంఐ అవుట్‌తో టీవీకి కనెక్ట్‌ చేసి 1080 పిక్సల్‌ రిజల్యూషన్‌లో గేమ్స్‌ ఆడుకునే వీలుంది. ధర సుమారు రూ.5,800. http://goo.gl/ lf6dV
టేబుల్‌లో కంప్యూటర్‌!
కూర్చుని కాఫీ తాగే డైనింగ్‌ టేబుల్‌ కంప్యూటర్‌లా పని చేస్తే! ఇలాంటిదే Table PC MTT300. తెర పరిమాణం 22 అంగుళాలు. తెర రిజల్యూషన్‌ 1920X1080 పిక్సల్స్‌. మల్టీ టచ్‌స్క్రీన్‌తో కంప్యూటర్‌ని వాడుకోవచ్చు. Intel Atom D2700 ప్రాసెసర్‌తో పని చేస్తుంది. ర్యామ్‌ 2 జీబీ. NVIDIA GF119 గ్రాఫిక్స్‌ని వాడారు. 128 జీబీ ఎస్‌ఎస్‌డీ స్టోరేజ్‌ డ్రైవ్‌ ఉంది. ఈథర్నెట్‌, వై-ఫై సదుపాయాలు ఉన్నాయి. విండోస్‌ 7 ఓఎస్‌తో పని చేస్తుంది. మల్టీ టచ్‌తో మునివేళ్లపైనే ఆప్షన్లు కదలాడతాయి. టేబుల్‌ కంప్యూటర్‌కి యూఎస్‌బీ పోర్ట్‌లు, మైక్రోఫోన్‌, హెడ్‌ఫోన్‌ జాక్‌లను ఏర్పాటు చేశారు. దీంతో టేబుల్‌ పీసీని ఇతర పరికరాలకు కనెక్ట్‌ చేసి వాడుకోవచ్చు.http://goo.gl/ROXqx
మీడియా ప్యాడ్‌
10.1 అంగుళాల తాకేతెర పరిమాణంతో ట్యాబ్లెట్‌ వాడాలనుకుంటే Huawei కంపెనీ తయారు చేసిన 'మీడియాప్యాడ్‌ 10 లింక్‌' ట్యాబ్‌ గురించి తెలుసుకోవాల్సిందే. తెర రిజల్యూషన్‌ 1280X800 పిక్సల్స్‌. మందం 9.9 ఎంఎం. 1.2Ghz quad core processor వాడారు. ర్యామ్‌ 1 జీబీ. ఇంటర్నల్‌ స్టోరేజ్‌ 16 జీబీ. బ్యాటరీ సామర్థ్యం 6,600mAh. వీడియో ప్లేబ్యాక్‌ టైం 6 గంటలు. ఆండ్రాయిడ్‌ 4.1 ఓఎస్‌తో పని చేస్తుంది. డ్యుయల్‌ కెమెరాలు (ముందు భాగంలో వీజీఏ, వెనక 3 మెగాపిక్సల్‌). వై-ఫై, బ్లూటూత్‌, డ్యుయల్‌ స్పీకర్లు ఉన్నాయి. డాల్బీ డిజిటల్‌ సరౌండ్‌ మ్యూజిక్‌ సిస్టం ఉంది. ధర సుమారు రూ.24,990. ఇతర వివరాలకు http://goo.gl/P8Flu 
క్రొత్తగా మరోటి
సోనీ కంపెనీ 1.5ఎక్స్‌ ఆప్టికల్‌ జూమ్‌తో ప్రొజెక్టర్‌ని అందుబాటులోకి తెచ్చింది. పేరు VPL-CX275 Projector. ఆఫీస్‌ సమావేశాలకు, తరగతి గదుల్లోనూ వాడుకునేందుకు అనువుగా దీన్ని రూపొందించారు. 5,200 lumens బ్రైట్‌నెస్‌తో ప్రొజెక్టర్‌ పని చేస్తుంది. రిజల్యుషన్‌ 1024X768 పిక్సల్స్‌. కాంట్రాస్ట్‌ నిష్పత్తి 3,000:1. ప్రొజెక్టర్‌లోనే బిల్డ్‌ఇన్‌ స్పీకర్‌ని ఏర్పాటు చేశారు. కెపాసిటీ 10 వోల్ట్స్‌. హెచ్‌డీఎంఐ, ఈథర్నెట్‌, 3.5 ఎంఎం ఆడియో జాక్‌... లాంటి మరిన్ని అదనపు సౌకర్యాలున్నాయి. ధర సుమారు రూ. 1,56,000. ఇతర వివరాలకు http://goo.gl/SuL4g
రాసింది రాసినట్టే!
పేపర్‌పైన ఏది రాసినా తక్షణమే అది డిజిటలైజ్‌ అయ్యే సాధనం ఉంది. అదే Staedtler Digital Pen.చిత్రంలో మాదిరిగా పెన్నుని ల్యాపీ, ట్యాబ్‌, పీసీలకు అనుసంధానం చేసి వాడుకోవచ్చు. ప్రత్యేక 'రిసీవర్‌ క్లిప్‌'ని నోట్‌బుక్‌పై భాగంలో ఏర్పాటు చేస్తారు. డిజిటల్‌ పెన్నుతో రాసిన మేటర్‌ని 'హ్యాండ్‌రైటింగ్‌ రికగ్నిషన్‌' సాఫ్ట్‌వేర్‌ ద్వారా రిసీవర్‌ క్లిప్‌ డిజిటలైజ్‌ చేసి సిస్టంలో భద్రం చేస్తుంది. 22 భాషల్ని పెన్ను సపోర్ట్‌ చేస్తుంది. యూఎస్‌బీ కేబుల్‌ ద్వారా పెన్నుని సిస్టంకి కనెక్ట్‌ చేయవచ్చు. http://goo.gl/nX9HT
ఎక్కడైనా సరే!
ఎలాంటి ప్రతికూల సందర్భాల్లోనైనా వాడుకునేలా రూపొందించిన ట్యాబ్లెట్‌పీసీనే Toughbook H2. ప్యానాసోనిక్‌ కంపెనీ తయారు చేసిన దీన్ని ఇంజినీరింగ్‌ పనులు, రహదారి నిర్మాణాల్లాంటి సందర్భాల్లో మండుటెండలో కూడా సౌకర్యంగా వాడుకోవచ్చు. అందుకు అనువుగా తాకేతెరని రూపొందించారు. సెకండ్‌ జనరేషన్‌ ఇంటెల్‌ కోర్‌ ఐ5 ప్రాసెసర్‌ని వాడారు. విండోస్‌ 7 ఓఎస్‌తో పని చేస్తుంది. తాకేతెర పరిమాణం 10.1 అంగుళాలు. 'డ్యుయల్‌ టచ్‌' దీని ప్రత్యేకత. ర్యామ్‌ 4 జీబీ. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే సుమారు 6 గంటలు వాడుకోవచ్చు. http://goo.gl/jq9AQ
స్పీకర్‌ కేక!
వ్యాపారం.. ఉద్యోగ నిమిత్తం ఎక్కువ ఫోన్‌కాల్స్‌కి స్పందించాల్సిన అవసరం ఉంటే Plantronics K100 స్పీకర్‌ ఫోన్ని వాడొచ్చు. తక్కువ పరిమాణంలో రూపొందడం దీని ప్రత్యేకత. దీంట్లో డ్యుయల్‌ మైక్రోఫోన్లు ఉన్నాయి. బయటి శబ్దాల్ని పూర్తిగా నియంత్రిస్తుంది. పెద్దగా ఏర్పాటు చేసిన కంట్రోల్స్‌తో వాల్యూమ్‌ని మేనేజ్‌ చేసుకోవడం సులువు. కారు జీపీఎస్‌ నుంచి తీసుకున్న ఆదేశాల్ని వినిపిస్తుంది. ఎఫ్‌ఎం కూడా వినొచ్చు. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే సుమారు 17 గంటలు మాట్లాడొచ్చు. ఇతర వివరాలకు http://goo.gl/G7yji 
Eveready UM 22 Power bank
ప్రయాణంలో బ్యాటరీ ఛార్జింగ్‌తో అసౌకర్యం లేకుండా ఉండేందుకు పోర్ట్‌బుల్‌ ఛార్జర్లను వాడొచ్చు. ఆయా ఛార్జర్లలో ముందే నిక్షిప్తం చేసిన ఛార్జింగ్‌తో ఫోన్‌, ట్యాబ్లెట్‌లను ఛార్జ్‌ చేయవచ్చు. వాటిల్లో Eveready UM 22 Power bank ఒకటి. యూఎస్‌బీ కేబుల్‌తో దీన్ని ఛార్జ్‌ చేయవచ్చు. 30 రోజుల స్టాండ్‌బై టైంతో పని చేస్తుంది. ధర సుమారు రూ. 1350. మరిన్ని వివరాలకు http://goo.gl/cPz2R 
ఇదే చిన్నది!
సోనీ కంపెనీ తయారు చేసిన 'సైబర్‌షాట్‌ డబ్యుజెడ్‌300' ప్రపంచంలోనే అతి చిన్న డిజిటల్‌ కెమెరాగా టెక్‌ ప్రియుల్ని ఆకట్టుకుంటోంది. బరువు ఎంతో తెలుసా? కేవలం 166 గ్రాములే. 20ఎక్స్‌ ఆప్టికల్‌ జూమ్‌తో ఫొటోలు తీసుకోవచ్చు. 18 మెగాపిక్సల్‌ కెమెరాతో దీన్ని వాడుకోవచ్చు. వేగంగా ఆటోఫోకస్‌ చేస్తుంది. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే సుమారు 500 ఫొటోలు తీసుకోవచ్చు. దీంట్లో ఇన్‌బిల్డ్‌గా అందిస్తున్న వై-ఫై నెట్‌వర్క్‌తో తీసుకున్న ఫొటోలు, వీడియోలను పీసీ, స్మార్ట్‌ఫోన్‌లకు సులువుగా కాపీ చేయవచ్చు. 3 అంగుళాల తెరపై తీసిన ఫొటోలు వీడియోలను చూడొచ్చు. హెచ్‌డీ వీడియో రికార్డింగ్‌ ఉంది. ఇన్‌బిల్డ్‌ ఫ్లాస్‌, ఎస్‌బీ కార్డ్‌ స్లాట్స్‌ కూడా ఉన్నాయి. ధర సుమారు రూ.19,990. మరిన్ని వివరాలకు http://goo.gl/ySLJM
మొత్తం టీవీనే!
టీవీ, కంప్యూటర్‌, ల్యాపీ... దేని తెరైనా ఎంతో కొంత ఫ్రేమ్‌ని కలిగి ఉంటుంది. మరి, ఫ్రేమ్‌ లేకుండా తయారు చేసిన టీవీ తెలుసా? అదే ఎల్‌జీ కంపెనీ తయారు చేసిన LA8600 LED TV. 55 అంగుళాల తెరతో త్రీడీ టీవీని రూపొందించారు. డిస్‌ప్లే హెచ్‌డీ రిజల్యుషన్‌లోనే ఉంటుంది. వాయిస్‌ కమాండ్స్‌, కదలికలతోనూ టీవీని ఆపరేట్‌ చేయవచ్చు. స్మార్ట్‌ మొబైల్స్‌, ట్యాబ్లెట్‌లను టీవీని అనుసంధానం చేయవచ్చు. బిల్టిన్‌ కెమెరాతో స్కైప్‌లో వీడియో ఛాటింగ్‌ చేయవచ్చు. వై-ఫై సౌకర్యంతో నెట్‌ని వాడుకోవచ్చు. ధర సుమారు రూ.51,990. మరిన్ని వివరాలకుhttp://goo.gl/0EGNc
రెండిటికీ ఒక్కటే!
ట్యాబ్లెట్‌గానూ... ల్యాపీగానూ వాడుకునేలా లెనోవా కంపెనీ కొత్త పరికరాన్ని అందిస్తోంది. అదే IdeaPadLynx K3011. మైక్రోసాఫ్ట్‌ అందిస్తున్న విండోస్‌ ఎనిమిదితో ఐడియా ప్యాడ్‌ పని చేస్తుంది. ఎప్పుడైనా దీన్ని ట్యాబ్లెట్‌లా వాడుకోవాలనుకుంటే కీబోర్డ్‌ని తొలగించి వాడుకోవచ్చు. కీబోర్డ్‌తో కలుపుకుని దీని బరువు 1.3 కేజీలు. కీబోర్డ్‌ లేకుండా ట్యాబ్‌ ఒక్కటే 667 గ్రాములు. తాకేతెర పరిమాణం 11.6 అంగుళాలు. రిజల్యుషన్‌ 1366X768 పిక్సల్స్‌. 1.8Ghz డ్యుయల్‌ కోర్‌ ఇంటెల్‌ ప్రాసెసర్‌ని వాడారు. ర్యామ్‌ 2 జీబీ. ఇంటర్నల్‌ స్టోరేజ్‌కిగానూ 64 జీబీ ఫ్లాష్‌ మెమొరీని వాడారు. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే ట్యాబ్‌ ఒక్కదాన్నే 8 గంటలు వాడుకోవచ్చు. కీబోర్డ్‌ని అనుసంధానం చేస్తే మరో ఎనిమిది గంటలు. 2 మెగాపిక్సల్‌ కెమెరా, మైక్రో హెచ్‌డీఎంఐ, డ్యుయల్‌ స్పీకర్‌ సదుపాయాలు ఉన్నాయి. ధర సుమారు రూ.51,990. మరిన్ని వివరాలకు http://goo.gl/ZgUdm
మరో ట్యాబ్‌
త్రీజీ సిమ్‌తో వాడుకునేలా సెల్‌కాన్‌ కంపెనీ తయారు చేసిన ట్యాబ్లెట్‌ మార్కెట్‌లో సందడి చేస్తోంది. పేరు CT888. 7 అంగుళాల తాకేతెర. 1.2Ghz సూపర్‌ ఫాస్ట్‌ డ్యుయల్‌కోర్‌ ప్రాసెసర్‌. రిజల్యుషన్‌ 1024X600 పిక్సల్స్‌. ర్యామ్‌ 512 ఎంబీ. ఇంటర్నల్‌ మెమొరీ 4 జీబీ. 32 జీబీ వరకూ మెమొరీని పెంచుకునే వీలుంది. వెనక 2 మెగాపిక్సల్‌, ముందు వీడియో ఛాటింగ్‌కి వీజీఏ కెమెరాని ఏర్పాటు చేశారు. ఆండ్రాయిడ్‌ 4.0 ఐస్‌క్రీం శాండ్‌విచ్‌ ఓఎస్‌తో వాడుకోవచ్చు. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 6 గంటలు వాడుకోవచ్చు. ట్యాబ్‌ మందం 9.9 ఎంఎం. బరువు 200 గ్రాములు. ధర సుమారు రూ.7,999. http://goo.gl/gmle0
ఇదే మొదటిది!
తక్కువ పరిమాణంలో ఉండి స్మార్ట్‌గా అందుబాటులోకి వచ్చింది నికాన్‌ కంపెనీ తయారు చేసిన CoolPixA. 16.2 మెగాపిక్సల్‌ డీఎక్స్‌ ఫార్మెట్‌తో తయారు చేశారు. ఇదే మొదటి 'కాంపాక్ట్‌ కెమెరా'గా టెక్‌ ప్రియులు పొగిడేస్తున్నారు. 18.5 ఎంఎం ఎఫ్‌2.8 లెన్స్‌ని కెమెరాతో పాటు అందిస్తున్నారు. హెచ్‌డీ వీడియోలను చిత్రీకరించేందుకు కెమెరా అనువైంది. 4ఎఫ్‌పీఎస్‌ షూటింగ్‌ స్పీడ్‌తో క్యాప్చర్‌ చేయవచ్చు. తక్కువ వెలుగులో కూడా ఫొటోల నాణ్యత బాగుంటుంది. ఫ్లాష్‌గన్‌, ఐఆర్‌ రిమోట్‌, ఎక్స్‌టర్నల్‌ ఫ్లాష్‌లను అమర్చుకునేందుకు అనువుగా కెమెరాని రూపొందించారు. 3 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే, ఎస్‌డీ కార్డ్‌ స్లాట్‌, బిల్డ్‌ఇన్‌ష్లాష్‌, హెచ్‌డీఎంఐ... సౌకర్యాలున్నాయి. ధర సుమారు రూ.54,950. http://goo.gl/gBg2i
ప్లేయర్‌ ప్రత్యేకం
పాటలు వినేందుకు ప్లేయర్‌ కావాలంటే Transcend MP350 గురించి తెలుసుకోవాల్సిందే. దీన్ని నీళ్లలో పడేసినా ఏం కాదు. 8జీబీ మెమొరీ. 'బిల్టిన్‌ ఫిట్నెస్‌ ట్రాకర్‌'తో రోజువారీ వ్యాయామాన్ని మానిటర్‌ చేయవచ్చు. అంగుళం పరిమాణంతో కనిపించే తెరపై పాటల పేర్లను సులువుగా ఎంపిక చేయవచ్చు. OLED టెక్నాలజీతో తెరని రూపొందించారు. దీంతో సూర్యకాంతిలోనూ తెరపై ట్రాక్స్‌ స్పష్టంగా కనిపిస్తాయి. బరువు కేవలం 22 గ్రాములే. వేసుకున్న దుస్తులకు తగిలించుకునేలా క్లిప్‌ని ఏర్పాటు చేశారు. ఎఫ్‌ఎం, వీడియో రికార్డింగ్‌ సదుపాయాలు ఉన్నాయి. ఎంపీ3, డబ్యుఎంఏ, డబ్యుఏవీ మ్యూజిక్‌ ఫార్మెట్‌లను సపోర్ట్‌ చేస్తుంది. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే సుమారు 12 గంటలు వినొచ్చు. ధర సుమారు రూ. 2,650. http://goo.gl/awpji
ల్యాపీలానూ...
కొన్నది ట్యాబ్లెట్టే! కానీ, దాన్ని ల్యాప్‌టాప్‌ మాదిరిగానూ వాడుకోవచ్చు. అదే విష్‌టెల్‌ తయారు చేసినIRA Capsule. DE తెర పరిమాణం 10.1 అంగుళాలు. రిజల్యుషన్‌ 1024X768 పిక్సల్‌. క్వర్టీ కీప్యాడ్‌ కేస్‌తో కలిపి ట్యాబ్లెట్‌ని వాడుకోగలగడం దీంట్లోని ప్రత్యేకత. కీబోర్డ్‌ని ట్యాబ్‌ని అనుసంధానం చేసి చిత్రంలో మాదిరిగా ల్యాపీలా వాడుకునే వీలుంది. ఆండ్రాయిడ్‌ 4.1 ఓఎస్‌తో పని చేస్తుంది. 1.6Ghzడ్యుయల్‌ కోర్‌ ప్రాసెసర్‌. ర్యామ్‌ 1జీబీ. ఇంటర్నల్‌ స్టోరేజ్‌ 16 జీబీ. వెనక భాగంలో 5 మెగాపిక్సల్‌ కెమెరాని ఏర్పాటు చేశారు. వీడియో ఛాటింగ్‌ ముందు వీజీఏ కెమెరా ఉంది. 3జీ సేవలతో సిమ్‌ వేసి వాడుకోవచ్చు. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 5 గంటలు పని చేస్తుంది. ధర సుమారు రూ.16,000. http://goo.gl/TS6hQ
మీరు డిజైనరా?
మీరు గ్రాఫిక్‌ డిజైనరైతే, లెనోవా తయారు చేసిన మానిటర్‌ గురించి తెలుసుకోవాల్సిందే. పేరు ThinkVision LT3053p. తెర పరిమాణం 30 అంగుళాలు. రిజల్యుషన్‌ ఎంతో తెలుసా? 2560X1600పిక్సల్స్‌. అడోబ్‌ ఫొటోషాప్‌తో పని చేసేవారికి రంగుల నాణ్యత చాలా స్పష్టంగా తెలుస్తుంది. తెరపై కనిపించే విజువల్స్‌ని మరింత స్పష్టంగా చూసేందుకు అనువుగా మానిటర్‌పైన బాక్స్‌ క్యాబిన్‌ ఏర్పాటు చేశారు. చిత్రంలో చూపిన మాదిరిగా మానిటర్‌ అమరిక ఉంటుంది. 1.07 బిలియన్ల రంగుల కలర్‌ డెప్త్‌తో వాడుకోవచ్చు. రెండు యూఎస్‌బీ 2.0 పోర్ట్‌లు, మూడు యూఎస్‌బీ 3.0 పోర్ట్‌లు ఉన్నాయి. http://goo.gl/mtK6U
ఎటైనా సరే!
వాడుతున్న నోట్‌బుక్‌ తెర ఎప్పుడూ ఒకేలా ఉంటే ఎలా? కావాల్సినట్టుగా ఎటైనా తిప్పేసుకునేలా ఉండాలంటే లెనోవా తయారు చేసిన ThinkPad Twist ఆల్ట్రాబుక్‌ గురించి తెలుసుకోవాల్సిందే. విండోస్‌ 8 ఓఎస్‌తో పని చేస్తుంది. నాలుగు రకాల మోడ్స్‌లో (ల్యాప్‌టాప్‌, స్టాండ్‌, ట్యాబ్లెట్‌, టెంట్‌) థింక్‌ప్యాడ్‌ని వాడుకోవచ్చు. 20ఎంఎం మందంతో నాజూకుగా తయారు చేశారు. బరువు కేవలం 1.6 కేజీలు. థర్డ్‌ జనరేషన్‌ ఇంటెల్‌ కోర్‌ ప్రాసెసర్‌తో పని చేస్తుంది. 8 జీబీ ర్యామ్‌. 500 జీబీ హార్డ్‌డ్రైవ్‌. తాకేతెర పరిమాణం 12.5 అంగుళాలు. రిజల్యుషన్‌ 1366X768 పిక్సల్స్‌. హెచ్‌డీ వెబ్‌కెమెరా, ఫుల్‌సైజు క్వర్టీ కీబోర్డ్‌, ట్రాక్‌ప్యాడ్‌, ట్రాక్‌పాయింట్‌లతో వాడుకోవచ్చు. మిని హెచ్‌డీఎంఐ, మిని డిస్‌ప్లేపోర్ట్‌, కార్డ్‌ రీడర్‌, రెండు యూఎస్‌బీ 3.0 పోర్ట్‌లు, ఈథర్నెట్‌ సదుపాయాలున్నాయి. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 6 గంటలు పని చేస్తుంది. http://goo.gl/la34R
ముట్టుకుంటే చాలు!
నెట్‌బుక్స్‌, నోట్‌బుక్స్‌ వాడుతున్నారా?ఇన్‌బిల్డ్‌గా ఏర్పాటు చేసిన టచ్‌ప్యాడ్‌తో పని సజావుగా సాగడం లేదా? అయితే, మీరు లాగీటెక్‌ కంపెనీ తయారు చేసిన వైర్‌లెస్‌ టచ్‌ప్యాడ్‌ గురించి తెలుసుకోవాల్సిందే. పేరు Wireless Rechargeable TouchPad T650. అన్ని అవసరాలకు సరిపడేలా 'మల్టీ టచ్‌ప్యాడ్‌'గా దీన్ని పిలుస్తున్నారు. విండోస్‌ 8, 7 ఓఎస్‌లతో వాడుకోవచ్చు. సుమారు 13 రకాల వేళ్ల కదిలికలతో (Gestures) పనుల్ని పూర్తి చేయవచ్చు. ప్యాడ్‌ని ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే నెల రోజులు వాడుకోవచ్చు. యూఎస్‌బీ కేబుల్‌తో అనుసంధానం చేయవచ్చు. బ్యాటరీ ఛార్జింగ్‌ని ఇండికేటర్‌ ద్వారా మానిటర్‌ చేయవచ్చు. ఐదు అంగుళాల పరిమాణంతో రూపొందించారు. వీడియో, ఇతర వివరాలకు http://goo.gl/1h7pK
ఐఫోన్‌ వాడుతున్నారా?
స్మార్ట్‌ మొబైల్‌ చేతిలో ఉంటే హైరిజల్యుషన్‌ వీడియోలు చిత్రిస్తుంటాం. ఈ నేపథ్యంలో ఐఫోన్‌తో వీడియోలు చిత్రీకరిస్తున్నారా? అయితే, మీరు 'ఐపోల్‌' గురించి తెలుసుకోవాల్సిందే. పేరుకి తగ్గట్టుగానే ఐఫోన్‌కి ప్రత్యేకంగా రూపొందించారు. చేతికి అందనంత ఎత్తులో వీడియో చిత్రీకరణ చేయాల్సివస్తే ఐపోల్‌ని వాడుకుని క్వాలిటీ వీడియోలు తీయవచ్చు. చిత్రంలో మాదిరిగా ఫోన్‌ని పోల్‌కి కనెక్ట్‌ చేసి వాడుకునేలా రూపొదించారు. అల్యుమినియం మెటరీయల్‌ వాడి తక్కువ బరువుతో పోల్‌ని తయారు చేశారు. వీడియో, ఇతర వివరాలకు http://goo.gl/AzOa4
కాస్త బడ్జెట్‌లో...
ట్యాబ్లెట్‌ ఆధునికంగా ఉండాలి. కానీ, బడ్జెట్‌లో చౌకగా అందుబాటులో ఉండాలి. అలాంటి ట్యాబ్‌ గురించి తెలుసుకోవాలంటే Zync Quad 8.0, 9.7 ట్యాబ్‌ల గురించి తెలుసుకోవాల్సిందే. 1.5 Ghz క్వాడ్‌కోర్‌ ప్రాసెసర్లను వాడారు. Eight-Core గ్రాఫిక్స్‌కి నిక్షిప్తం చేశారు. ర్యామ్‌ 2 జీబీ. ఇంటర్నల్‌ స్టోరేజ్‌ 16 జీబీ. పేర్లలో నెంబర్ల మాదిరిగానే వీటి తెరల పరిమాణం 8 అంగుళాలు, 9.7 అంగుళాలు. 8.0 వెర్షన్‌ తెర రిజల్యుషన్‌ 1024X768. 9.7 వెర్షన్‌ తెర రిజల్యుషన్‌ 2048X1536. రెండు ట్యాబ్లెట్‌లు ఆండ్రాయిడ్‌ 4.1 జెల్లీబీన్‌ ఓఎస్‌తో పని చేస్తాయి. వీడియోలు, ఫొటోల చిత్రీకరణకు వెనక భాగంలో 5 మెగాపిక్సల్‌ కెమెరాని ఏర్పాటు చేశారు. వీడియో ఛాటింగ్‌కి ముందు భాగంలో 2 మెగాపిక్సల్‌ ఉంది. వీటి ధరలు వరుసగా రూ. 12,990, రూ.13,990. మరిన్ని వివరాలకు http://goo.gl/a7Qht
చూడ్డానికే స్మార్ట్‌
పరికరం ఏదైనా అందమైన డిజైన్‌తో పాటు అంతే సామర్థ్యాన్ని కలిగి ఉంటే!! వాడుకునేప్పుడు విసుగు లేకుండా ఉంటుంది. ఇదే కోవలోకి వస్తుంది డెల్‌ కంపెనీ రూపొందించిన Latitude 6430U ఆల్ట్రాబుక్‌. చేస్తున్న పనికి తగ్గట్టుగా అల్ట్రాబుక్‌ అవతారాలు మార్చేస్తుంది. 14 అంగుళాల హెచ్‌డీ తెర (1366X768), ఇంటెల్‌ కోర్‌ ఐ5 ప్రాసెసర్‌, 4 జీబీ ర్యామ్‌, 128జీబీ ఎస్‌ఎస్‌డీ స్టోరేజ్‌, హెచ్‌డీఎంఐ, ఈథర్నెట్‌, వీజీఏ, కార్డ్‌రీడర్‌, వెబ్‌ కెమెరా, వై-ఫైలతో పని చేస్తుంది. బరువు 1.69 కేజీలు. హైక్వాలిటీ ఇన్‌బిల్డ్‌ స్పీకర్లను ఏర్పాటు చేశారు. ధర సుమారు రూ.69,990. మరిన్ని వివరాలకు http://goo.gl/Ht2wy
నానో పీసీ!
టిఫిన్‌ బాక్స్‌ పరిమాణంలో ఉండి మ్యాక్‌పై మ్యాజిక్‌ చేసిన 'మ్యాక్‌ మిని' గురించి తెలిసిందే. ఫాక్స్‌కాన్‌ కంపెనీ తయారు చేసిన దీని పేరు NanoPC AT-5250. ఇంటెల్‌ ఆటమ్‌ 1.8Ghz ప్రాసెసర్‌ని వాడారు. ఇంటెల్‌ 3650HD గ్రాఫిక్స్‌ వాడారు. నాజూకు కనిపించే ఈ బాక్స్‌కి మానిటర్‌ లేదా స్మార్ట్‌ టీవీ వెనక భాగంలో పెట్టుకుని వాడుకోవచ్చు. దీంట్లో ఇన్‌బిల్డ్‌గా వై-ఫై పోర్ట్‌లు, రెండు యూఎస్‌బీ 3.0 పోర్ట్‌లు, నాలుగు యూఎస్‌బీ 2.0 పోర్ట్‌లు, గిగాబిట్‌ ఈథర్నెట్‌, హెడ్‌ఫోన్‌, మైక్రోఫోన్‌ జాక్స్‌, మల్టీ కార్డ్‌ రీడర్‌, హెచ్‌డీఎంఐ పోర్ట్‌లు ఉన్నాయి. ఈ పీపీ రన్‌ అవ్వడానికి అయ్యే కరెంటు ఖర్చు 24W. మరిన్ని వివరాలకు http://goo.gl/sR3DF
మౌస్‌ అనుకునేరు!
చూస్తుంటే ఇదేదో మౌస్‌లా ఉందే అనుకుంటే పొరబాటే. ఇదో బ్లూటూత్‌ స్పీకర్‌. పేరు Portronics Pebble. దీంట్లో బిల్డ్‌ఇన్‌ మైక్రోఫోన్‌ కూడా ఉంది. లెడ్‌ డిస్‌ప్లేతో కంట్రోల్స్‌ని వాడుకోవచ్చు. స్పీకర్‌పై కనిపించే కంట్రోల్స్‌ మౌస్‌ బటన్ల మాదిరిగానే రూపొందించారు. టచ్‌ ప్యానల్‌తో కంట్రోల్స్‌ని వాడుకోవచ్చు. బరువు 137 గ్రాములు. మైక్రోఎస్‌డీ స్లాట్‌తో కార్డ్‌ని ఇన్‌సర్ట్‌ చేసి ఎంపీ3 సాంగ్స్‌ని వినొచ్చు. 32 జీబీ వరకూ సపోర్ట్‌ చేస్తుంది. 3.5 ఎంఎంతో టీవీ, ల్యాపీ, కంప్యూటర్‌, ఎంపీ3 ప్లేయర్లకు అనుసంధానం చేసి మ్యూజిక్‌ వినొచ్చు. బ్లూటూత్‌ నెట్‌వర్క్‌తో సుమారు 10 మీటర్ల పరిధిలో పని చేస్తుంది. ధర సుమారు రూ.3,499. యూఎస్‌బీతో ఛార్జ్‌ చేయవచ్చు. మరిన్ని వివరాలకు http://goo.gl/GAWxY
'స్మార్ట్‌' పీసీ
ట్యాబ్లెట్‌ కొనాలా? నోట్‌బుక్‌ తీసుకోవాలా? అని ఆలోచిస్తున్నారా? అయితే, కాస్త ఖర్చయినా పర్వాలేదు అనుకుంటే... శామ్‌సంగ్‌ కంపెనీ తయారు చేసిన స్మార్ట్‌ పీసీ గురించి తెలుసుకోవాల్సిందే. కొత్తగా అందుబాటులోకి వచ్చిన విండోస్‌ 8 ఓఎస్‌తో పని చేస్తుంది. తాకే తెర పరిమాణం 11.6 అంగుళాలు. రిజల్యుషన్‌ 1366X768పిక్సల్స్‌. 1.8Ghzడ్యుయల్‌ కోర్‌ ఇంటెల్‌ ఆటమ్‌ ప్రాసెసర్‌ని వాడారు. ర్యామ్‌ 2జీబీ. ఇంటర్నల్‌ స్టోరేజ్‌ 64 జీబీ. ప్రత్యేక డాకింగ్‌ సిస్టం ద్వారా క్వర్టీ కీబోర్డ్‌ని అనుసంధానం చేసి నోట్‌బుక్‌ మాదిరిగా వాడుకోవచ్చు. 9.9ఎంఎం. బరువు 744 గ్రాములు. కీబోర్డ్‌తో కలిపితే 1.45 కేజీలు. రెండు ఇన్‌బిల్డ్‌ స్పీకర్లను ఏర్పాటు చేశారు. ముందు భాగంలో వీడియో ఛాటింగ్‌ 2 మెగాపిక్సల్‌ కెమెరా, వెనక 8 మెగాపిక్సల్‌ని ఏర్పాటు చేశారు. ఇతర వివరాలకు http://goo.gl/lclGU
చాలా 'స్లిమ్‌'
* ప్రపంచంలోనే తొలి నాజుకైన ట్యాబ్లెట్‌!
* మందం 6.9 ఎంఎం. బరువు 495 గ్రాములు! ట్యాబ్‌ పేరేంటో తెలుసా? 'ట్యాబ్లెట్‌ జెడ్‌'
సోనీ కంపెనీ తొలిసారి నాజూకైన ట్యాబ్లెట్‌ను అందుబాటులోకి తేనుంది. దీని తెర పరిమాణం 10.1 అంగుళాలు. రిజల్యుషన్‌ 1920X1200. ఐప్యాడ్‌ మందం 9.4 ఎంఎం. బరువు 662 గ్రాములు). హెచ్‌డీ రిజల్యుషన్‌తో గ్రాఫిక్స్‌ని చూడొచ్చు. ఆండ్రాయిడ్‌ 4.1 (జెల్లీబీన్‌) ఓఎస్‌తో పని చేస్తుంది. ప్రాసెసింగ్‌ వేగం ఏ మాత్రం తక్కువ కాకుండా 1.5Ghz క్వాడ్‌ కోర్‌ ప్రాసెసర్‌ని వాడారు. ర్యామ్‌ 2జీబీ. బ్యాటరీ సామర్థ్యం 6,000 mAh. బ్లూటూత్‌, వై-ఫై, 3జీ సేవలతో పాటు 4జీ నెట్‌వర్క్‌ని ట్యాబ్‌లో అందిస్తున్నారు. వీడియో ఛాటింగ్‌కి ముందు భాగంలో 1 మెగాపిక్సల్‌ కెమెరాని, వెనక 8 మెగాపిక్సల్‌ కెమెరాని నిక్షిప్తం చేశారు. ధర సుమారు రూ.27,000 ఉండొచ్చని అంచనా.
'లెడ్‌' సీరిస్‌ 





మానిటర్‌ని మార్చాలనుకుంటే వ్యూసోనిక్‌ కొత్తగా రూపొందించిన లెడ్‌ సీరిస్‌ మానిటర్ల గురించి తెలుసుకోవాల్సిందే. పేరు VX2770Smh LED మానిటర్‌. 1080 పిక్సల్స్‌ హెచ్‌డీ స్క్రీన్‌తో వీటిని అందిస్తున్నారు. తెర పరిమాణం 27 అంగుళాలు. హెచ్‌డీఎంఐ, డీవీఐ, వీజీఏ కనెన్షన్స్‌తో వాడుకోవచ్చు. 'యాంటీ గ్లేర్‌' మరో అదనపు ఆకర్షణ. మానిటర్‌ సెట్టింగ్స్‌ని మార్చుకునేందుకు 'టచ్‌ సెన్సిటీవ్‌' బటన్లను ఏర్పాటు చేశారు. ఈ లెడ్‌ మానిటర్లు వాడడం ద్వారా 40 శాతం విద్యుత్‌ని ఆదా చేయవచ్చట. ఇన్‌బిల్డ్‌ ఆడియో స్పీకర్లు ఉన్నాయి. వీడియో, ఇతర వివరాలకు http://goo.gl/ubz86లెడ్‌ టెక్నాలజీతో!

ఎసర్‌ 1.2 కేజీల బరువుతో సరికొత్త పోర్టబుల్‌ ప్రొజెక్టర్‌ని అందుబాటులోకి తెచ్చింది. పేరు Acer L51W Projector. 'లెడ్‌ లైట్‌ సోర్స్‌'తో ఇది పని చేస్తుంది. రిజల్యుషన్‌ 1280X768. హెచ్‌డీఎంఐ అవుట్‌, యూఎస్‌బీ పోర్ట్‌లతో రూపొందించారు. ఎస్‌డీ కార్డ్‌ స్లాట్‌తో మెమొరీ కార్డ్‌లను అనుసంధానం చేసి వాడుకోవచ్చు. పోర్ట్‌లకు కనెక్ట్‌ చేసిన యూఎస్‌బీల్లోని డేటాని రీడ్‌ చేసి ప్లే చేయడం దీంట్లోని ప్రత్యేకత. ఉదాహరణకు పెన్‌డ్రైవ్‌, మెమొరీ కార్డ్‌ల్లో సేవ్‌ చేసిన ఫొటోలు, వీడియోలను ప్రొజెక్టర్‌కి కనెక్ట్‌ చేసి ప్రదర్శించి చూడొచ్చు. వర్డ్‌, ఎక్సెల్‌, పవర్‌పాయింట్‌, పీడీఎఫ్‌ డాక్యుమెంట్‌లను కూడా సపోర్ట్‌ చేస్తుంది. ధర సుమారు రూ.85,000. http://goo.gl/3KfgG

'మి-301' ప్రింటర్‌
'మి-301' ప్రింటర్‌! దీన్ని వాడాలంటే.. ప్రత్యేక టేబుల్‌ అక్కర్లేదు! వైర్‌లతో కూడా పని లేదు. ట్యాబ్లెట్‌... మొబైల్స్‌తో కలిసి పని చేస్తుంది. ఇది ప్రంచంలోనే తొలి బుల్లి ప్రింటర్‌ కూడా! ఎప్సన్‌ కంపెనీ రూపొందించిన దీని పూర్తి పేరు Expression Me-301. అందుకు ఎప్సన్‌ DURABrite Ultra Inkసౌకర్యాన్ని అందిస్తోంది. నాణ్యతతో కూడిన ఫొటో ప్రింట్‌లను తీసుకునే ముందు ప్రింటర్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక బటన్స్‌తో ఫొటోలను ఎడిట్‌ చేయవచ్చు. 'రెడ్‌ఐ కరక్షన్‌'కి ప్రత్యేక బటన్‌ ఉంది. Epson Photo Enhanceతో 'స్కిన్‌టోన్స్‌, ఎక్స్‌పోజర్‌ లెవల్స్‌, కలర్‌ కాస్ట్‌'లను కావాల్సినట్టుగా మార్చుకోవచ్చు. ప్రింటింగ్‌ మ్యాక్స్‌ రిజల్యుషన్‌ 5760X1440.మ్యాక్‌ ఓఎస్‌తో కలిపి వాడుకునే వీలుంది. మరిన్ని వివరాలకుhttp://goo.gl/z5tHR

మరో ట్యాబ్‌

డ్యుయల్‌ కోర్‌ ప్రాసెసర్‌తో కంప్యూటర్‌లు వాడాం. ఇక ట్యాబ్‌లను కూడా వాడొచ్చు. ఎందుకంటే Swipe Velocity ట్యాబ్‌ని ARM Cortex- A9 డ్యుయల్‌ కోర్‌తో అందుబాటులోకి తీసుకొచ్చారు. ర్యామ్‌ 1 జీబీ. తాకే తెర పరిమాణం 8 అంగుళాలు. రిజల్యుషన్‌ 1024X768 పిక్సల్స్‌. ఇంటర్నల్‌ స్టోరేజ్‌ 8 జీబీ. వెనక భాగంలో 2 మెగాపిక్సల్‌ కెమెరా, ముందు 1.3 మెగాపిక్సల్‌ కెమెరాని ఏర్పాటు చేశారు. ఆండ్రాయిడ్‌ 4.1 ఓఎస్‌ వెర్షన్‌తో పని చేస్తుంది. బరువు 437 గ్రాములు. తక్కువ మందంతో నాజూకుగా కనిపించడం ట్యాబ్‌ ప్రత్యేకత. ధర సుమారు రూ.13,999. మరిన్ని వివరాలకు http://goo.gl/GMm8U
వినేందుకు ఒకటి






ల్యాప్‌, ట్యాబ్‌, మొబైల్‌లో మ్యూజిక్‌ వినేందుకు ఇష్టపడుతుంటారా? అయితే, అనువైన మ్యూజిక్‌ సాధనం Portronics Pure Sound Pro గురించి తెలుసుకోవాల్సిందే. దీని బరువు సుమారు 1 కేజీ. ముందు భాగంలో ఏర్పాటు చేసిన చిన్న ఎల్‌సీడీ తెరతో స్పీకర్‌ని ఆపరేట్‌ చేయవచ్చు. Turbo Bass మోడ్‌లో మరింత క్వాలిటీతో మ్యూజిక్‌ వినొచ్చు. ఎఫ్‌ఎం, ఎంపీ3 ప్లేయర్‌ కూడా ఉన్నాయి. యూఎస్‌బీ డ్రైవ్‌, ఎస్‌కార్డ్‌తో పాటల్ని వినొచ్చు. ఒక్కసారి రీఛార్జ్‌ చేస్తే సుమారు ఎనిమిది గంటలు పని చేస్తుంది. ధర రూ. 3,499. http://goo.gl/sRyiW